Abn logo
Aug 13 2021 @ 16:13PM

తాలిబన్ల స్వాధీనంలో 15 నగరాలు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని 15 ప్రొవిన్షియల్ రాజధానులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నగరం కాబూల్‌ను వశం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్నారు. కతార్ కేంద్రంగా జరుగుతున్న శాంతి యత్నాల్లో పురోగతి కనిపించడం లేదు. తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, ప్రభుత్వ దళాలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. లొంగిపోయిన సైనికులను చంపడంతోపాటు, సామాన్యులపై దాడులు చేస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది. 


ఇదిలావుండగా, ప్రొవిన్షియల్ కేపిటల్ నగరాలు, ఇతర పట్టణాల్లో హింసకు తక్షణమే తెరదించాలని భారత్, జర్మనీ, కతార్, టర్కీ కోరాయి. రాజకీయ పరిష్కారం కోసం శాంతి ప్రక్రియను వేగవంతం చేయాలని కతార్ గురువారం ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. 


ప్రస్తుతం తాలిబన్ల నియంత్రణలోకి వచ్చిన నగరాలు :

- సర్-ఏ-పోల్

- షెబెర్ఘాన్

- ఐబక్

- కుందుజ్

- తలుకన్

- పుల్-ఏ-ఖుమ్రి

- ఫరా

- జరాంజ్

- ఫైజాబాద్

- ఘజ్ని

- హెరాత్

- కాందహార్

- లష్కర్ గహ్

- ఫెరుజ్ కోహ్

- కల-ఈ నా