Advertisement
Advertisement
Abn logo
Advertisement

టూ వీలర్‌పై 178 చలాన్లు.. రూ. 42,225 జరిమానా.. బైక్ వదిలేసి..!

హైదరాబాద్ సిటీ/అంబర్‌పేట : ఓ ద్విచక్రవాహనంపై 178 పెండింగ్‌ చలాన్లు ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. సోమవారం సాయం త్రం అలీకేఫ్‌ చౌరస్తాలో కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. హోండా ప్యాషన్‌ వాహనం (ఏపీ 23ఎం 9895) చలాన్లు చెక్‌ చేయగా, 178 పెండింగ్‌ లో ఉన్నట్లు తేలింది. చలానాల మొత్తం రూ.42,225గా గుర్తించారు. వాహనం నడుపుతున్న వ్యక్తిని విచారించగా, బైక్‌ను తాకట్టు పెట్టుకున్నానని, చలాన్లతో తనకు ఎలాంటి సంబంధంలేదని వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడు.

Advertisement
Advertisement