Abn logo
May 18 2021 @ 07:49AM

హైదరాబాద్‌లో 18 ఏళ్ల యువతి అదృశ్యం

హైదరాబాద్ : నగరంలోని మల్కాజగిరిలో ఓ యువతి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి ఆర్టీసీకాలనీ నివాసి అంబల యశ్వంతి (18) సోమవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. ఆమె తిరిగి రాక పోవడంతో తెలిసిన చోట్ల ఆమె కోసం వెదికినా ఆచూకీ లభించలేదు. ఆమె సోదరుడు రూపేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement