బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కరోనా కేసుల సంఖ్య ఇదే. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,939కి చేరింది. ఇదే సమయంలో మొత్తమ్మీద 598మంది కరోనా బాధితులు కోలుకోగా, 42 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలియజేశారు.