యూపీ ఎన్నికలు: ఎస్పీలో చేరిన బీజేపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2021-12-12T22:57:57+05:30 IST

గోరఖ్‌పూర్ జిల్లాలోని చిల్లుపర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్‌ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన వినయ్ శంకర్ తివారీ, అలాగే సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఖలిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ..

యూపీ ఎన్నికలు: ఎస్పీలో చేరిన బీజేపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంచి ఊపు మీదున్న సమాజ్‌వాదీ పార్టీకి భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల నుంచి మరింత బూస్ట్ లభించింది. ఆ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో సైకిల్ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమాజ్‌వాదీ కండువా కప్పుకున్నారు.


గోరఖ్‌పూర్ జిల్లాలోని చిల్లుపర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్‌ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన వినయ్ శంకర్ తివారీ, అలాగే సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ఖలిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన దిగ్విజయ్ నారాయణ్ అలియస్ జై చూబే అనే ఇద్దరు పార్టీ మారారు. వీరితో పాటు యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గణేష్ శంకర్ పాండే సైతం అఖిలేష్ పార్టీలో చేరారు. ఈయన 2010లో బీఎస్‌పీ తరపున కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరించారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ వర్గానికి చెందిన అనేక మంది ఎస్పీలో చేరారు.

Updated Date - 2021-12-12T22:57:57+05:30 IST