పట్టాలపై విరిగి పడిన కొండచరియలు.. రైలు బ్రేకులు వేసినా..

ABN , First Publish Date - 2020-03-30T21:02:17+05:30 IST

వేగంగా వెళ్తోందా రైలు. ఇంతలో పట్టాలకు అడ్డుగా కొన్ని రాళ్ల కుప్పలు ఉండటం చూశాడు దాని డ్రైవర్.

పట్టాలపై విరిగి పడిన కొండచరియలు.. రైలు బ్రేకులు వేసినా..

హునాన్: వేగంగా వెళ్తోందా రైలు. ఇంతలో పట్టాలకు అడ్డుగా కొన్ని రాళ్ల కుప్పలు ఉండటం చూశాడు దాని డ్రైవర్. వెంటనే స్పందించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆగిపోయిన రైలు చక్రాలు పట్టాలపై జారి నిప్పురవ్వలు వెదజల్లుతుండగా.. ఆ ట్రైన్ వెళ్లి పట్టాలకు అడ్డంగా ఉన్న రాళ్లగుట్టను ఢీకొట్టింది. అంతే ఆ ధాటికి అయిదు బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయి. దాని ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. చెంజో సిటీ నుంచి గాంగ్‌‌జో ప్రాంతానికి వెళ్తున్న రైలుకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని, కానీ 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-30T21:02:17+05:30 IST