Stabs to Death: హత్యకు దారితీసిన తోపుడుబండ్ల వివాదం

ABN , First Publish Date - 2022-08-25T01:09:24+05:30 IST

తోపుడు బండ్లు నిలిపే ప్రదేశం విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. 20 ఏళ్ల యువకుడు తన కజిన్‌ను..

Stabs to Death: హత్యకు దారితీసిన తోపుడుబండ్ల వివాదం

కోట: తోపుడు బండ్లు (carts) నిలిపే ప్రదేశం విషయంలో తలెత్తిన వివాదం హత్య (Murder) కు దారితీసింది. 20 ఏళ్ల యువకుడు తన కజిన్‌ను కత్తితో పొడవడంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ దాడిని ఆపేందుకు వచ్చిన మృతుని తండ్రి, అతని సోదరులు ఇద్దరు గాయపడ్డారు. రాజస్థాన్‌లోని కోట సిటీ (Kota city)లో బుధవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటనలో మృతిచెందిన సుఫెల్ (19), అతని కజన్ రషీద్ (20) ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి వచ్చారు. కోటలో పండ్ల వ్యాపారం చేసుకునే వారు. విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఒక మాల్ వెలుపల తమ పండ్ల బండ్లు ఉంచేవారు. ఉదయం 9.30 గంటల తమ బండ్లు ఉంచే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో రషీద్ ఆగ్రహంతో సుఫీల్ ఛాతీపై కత్తతో పొడిచాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేలేపే సుఫీల్ మరణించినట్టు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవేశ్ భరద్వాజ్ తెలిపారు. దాడిని ఆపేందుకు వచ్చిన సుఫీల్ తండ్రి, ఇద్దరు సోదరులు జావేద్, షాన్‌కు కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయని చెప్పారు. వీరు ఇచ్చిన ఫిర్యాదుతో రషీద్‌ను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సుఫీల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు దేవేశ్ భరద్వాజ్ వివరించారు.

Updated Date - 2022-08-25T01:09:24+05:30 IST