జిల్లాలో రూ. 218 కోట్ల విద్యుత్‌ బకాయిలు

ABN , First Publish Date - 2021-10-21T03:35:01+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు రూ. 218 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని ఆ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు

జిల్లాలో రూ. 218 కోట్ల విద్యుత్‌ బకాయిలు
33/11 కేవీ బ్రేకర్‌ను ప్రారంభిస్తున్న ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి

ఎస్‌ఈ విజయకుమార్‌ రెడ్డి

కోట, అక్టోబరు 20 : జిల్లాలో ఇప్పటి వరకు రూ. 218 కోట్ల  విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని ఆ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కోట మండలం చెందోడులో ఏర్పాటు చేసిన  33/11 కేవీ బ్రేకర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని నగరపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి రూ. 80 కోట్లు, ప్రైవేట్‌ రంగం నుంచి రూ.77 కోట్లు, ఆక్వా రంగ సంస్థల నుంచి రూ.10కోట్లు విద్యుత్‌ బిల్లులు వసూలు కావలసి ఉందన్నారు.  బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో విద్యుత్‌ కోతలు ఎత్తివేయడంతోపాటు, 45 కొత్త సబ్‌స్టేషన్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. వ్యవసాయానికి పగలు 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 11,251 మంది రైతులు ఈ సదుపాయాన్ని పొందుతున్నారన్నారు.  ట్రాన్స్‌కో ఈఈ ఇస్మాయిల్‌, డీఈఈ జే రాము, ఏఈలు సురేష్‌బాబు, మాధవరెడ్డి, పోలయ్య, సబ్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. 




Updated Date - 2021-10-21T03:35:01+05:30 IST