లాక్‌డౌన్ అమల్లో ఉండగానే.. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో...

ABN , First Publish Date - 2020-05-22T01:57:28+05:30 IST

మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టడం అటుంచితే రోజురోజుకూ ...

లాక్‌డౌన్ అమల్లో ఉండగానే.. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో గురువారం కొత్తగా 2,345 కరోనా కేసులు, 64 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టడం అటుంచితే రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో.. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 30 నుంచి 40 శాతం కేసులు వెలుగుచూస్తుండటం గమనార్హం. గురువారం మహారాష్ట్రలో కొత్తగా 2,345 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.


మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే కరోనా వల్ల 64 మంది మరణించినట్లు పేర్కొంది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,642కు చేరగా.. కరోనా మరణాల సంఖ్య 1454కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను మే 31తో ఎత్తివేయాలని కేంద్రం భావిస్తున్న ఈ తరుణంలో మహారాష్ట్రలో రోజుకు 2వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆ రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. లాక్‌డౌన్ అమల్లో ఉంటేనే.. ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే.. లాక్‌డౌన్ ఎత్తేస్తే మహారాష్ట్రలో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.



Updated Date - 2020-05-22T01:57:28+05:30 IST