Advertisement
Advertisement
Abn logo
Advertisement

24 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్టు

కృష్ణాదేవిపేట, నవంబరు 27: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ తెలిపారు. శనివారం స్ధానిక పీహెచ్‌సీ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పడమటి శ్యామ్‌, బాహటం పృఽధ్వీరాజ్‌లు స్కూటీపై 24 కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. ద్విచక్రవాహనంతో పాటు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదుచేసి, రిమాండ్‌ నిమిత్తం విశాఖ సెంట్రల్‌జైల్‌కు తరలించామన్నారు. తనిఖీల్లో ఏఎస్‌ఐలు రమణమూర్తి, గురుమూర్తి, సిబ్బంది రమణ, వాసు తదితరులు పాల్గొన్నారన్నారు 

Advertisement
Advertisement