Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమాయకుడిలా కనిపించే ఈ 24 ఏళ్ల కుర్రాడికి ఉందో సీక్రెట్ లైఫ్.. తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్లగొడితే..

ఇంటర్నెట్ డెస్క్: పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడికి ప్రస్తుతం 24ఏళ్లు. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇతడికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్లగొట్టిన తర్వాత అతడు పెద్ద ఘనకార్యాలే చేశాడు. పేరును మార్చుకుని సీక్రెట్ లైఫ్‌ను సృష్టించుకున్నాడు. ఇంతకూ అతడు ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన ఫజ్లా‌‌.. చిన్నప్పటి నుంచి దూకుడుగా వ్యవహరించేవాడు. స్కూల్‌లో తోటి విద్యార్థులతో తరచూ గొడవలు పడుతూ.. వాటిని ఇంటి వరకూ తెచ్చేవాడు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. అతడిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. దీంతో ఫజ్లాను తన మేనమామ చేరదీశాడు. ఆయన చూపించిన అతి ప్రేమ వల్ల.. ఫజ్లా క్రమంగా జల్సాలకు అలవాటు పడ్డాడు. ఎంజాయ్ చేసేందుకు తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి సిలిగురికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే అతడు మద్యానికి, మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. 


వాటికి అతడు అలవాటు పడటమే కాకుండా.. ఆ మత్తు పదార్థాలను పూర్నియాకు తరలిస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం తన పేరును విక్కీగా మార్చుకుని.. స్థానిక యువతను తన గ్యాంగ్‌లో చేర్చుకుని గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో.. అతడిని పట్టుకునేందకు పోలీసులు చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే తాజాగా పక్కాప్రణాళికతో దాడి చేయడంతో.. విక్కీ పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో అతడి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బును, మత్తపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement