క్లినికల్ ట్రయల్స్‌..2 ఏళ్ల చిన్నారికి కొవ్యాక్సిన్!

ABN , First Publish Date - 2021-06-25T04:43:55+05:30 IST

ప్రస్తుతం దేశంలో చిన్నారులపై కొవ్యాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆస్పత్రిలో వైద్యులు రెండేళ్ల చిన్నారికి కొవ్యాక్సిన్ టీకా వేశారు.

క్లినికల్ ట్రయల్స్‌..2 ఏళ్ల చిన్నారికి కొవ్యాక్సిన్!

లఖ్నవూ: ప్రస్తుతం దేశంలో చిన్నారులపై కొవ్యాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యులు రెండేళ్ల చిన్నారికి కొవ్యాక్సిన్ టీకా వేశారు. ట్రయల్స్‌లో పాల్గొన్న చిన్నారి ఓ వైద్యురాలి కూతురని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. టీకా ఇచ్చాక చిన్నారిని రెండు గంటల పాటు పరిశీలనలో ఉంచామని, అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ఇంటికి పంపించినట్టు వారు తెలిపారు. పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు భారత్ బయోటెక్‌కు డీసీజీఐ మే నెలలో అనుమతిచ్చింది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవ్యాక్సిన్‌ టీకాను వీలైనంత త్వరగా గుర్తించేలా ప్రధాని మోదీ కల్పించుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా లేఖ రాశారు.

Updated Date - 2021-06-25T04:43:55+05:30 IST