Abn logo
Sep 23 2020 @ 02:04AM

3 కార్మిక నియమ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రయోజనాల నిమిత్తం రూపొందించిన మూడు నియమ నిబంధనల బిల్లులను (లేబర్‌ కోడ్స్‌) లోక్‌సభ మంగళవారంనాడు ఆమోదించింది. వీటి ద్వారా దా ాపు 50 కోట్ల మంది కార్మికులకు వేతన భద్రత, సామాజిక భద్రత లభిస్తాయని, పనిచేసే చోట్ల సానుకూల వాతావరణం ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగావర్‌ చెప్పారు.

వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిచేసే పరిస్థితులు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రతలకు సంబంధించిన కోడ్‌లను శనివారంనాడే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిం ది. పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన సూచనల్లో మూడొంతుల సూచనలను వీటిలో చేర్చామని గంగావర్‌ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement