కోవిడ్-19 నుంచి కోలుకున్న 36 రోజుల శిశువు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-05-29T02:12:55+05:30 IST

మహారాష్ట్రలో 36 రోజుల చిన్నారి కరోనాతో పోరాడి విజయం సాధించింది. కరోనాతో వణికిపోతున్న మహారాష్ట్రలో

కోవిడ్-19 నుంచి కోలుకున్న 36 రోజుల శిశువు.. వీడియో వైరల్

ముంబై: మహారాష్ట్రలో 36 రోజుల చిన్నారి కరోనాతో పోరాడి విజయం సాధించింది. కరోనాతో వణికిపోతున్న మహారాష్ట్రలో రోజుల చిన్నారి కోలుకోవడం అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కరోనాతో పోరాడేందుకు వయసు ముఖ్యం కాదని పేర్కొంది. ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో 36 రోజుల చిన్నారి కోలుకుందని తెలిపింది. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. సీఎంవో షేర్ చేసిన క్షణాల్లోనే వీడియో వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 5.83 లక్షల మంది వీక్షించారు. చిన్నారిని తల్లి ఎత్తుకుని వస్తుండగా ఆసుపత్రి సిబ్బంది కరతాళ ధ్వనులతో అభినందించారు.  

Updated Date - 2020-05-29T02:12:55+05:30 IST