Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.3 కోట్ల అప్పులు చేసి పరారీ

బేకరీ, సూపర్‌ మార్కెట్‌ యజమానుల నిర్వాకం

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

కలికిరి, డిసెంబరు 2: కలికిరికి చెందిన ఇద్దరు వ్యాపారులు దాదాపు రూ.3 కోట్లు అప్పులు చేసి బిచాణా ఎత్తేశారు. గురువారం సాయం కాలా నికి అసలు విషయం తెలుసుకుని పదుల సంఖ్యలో బాధితులు రాత్రి పోలీసు స్టేషనులో  ఫిర్యాదులు చేయడానికి క్యూ కట్టారు. కలికిరికి చెం దిన ఖాదర్‌ బాషా నాలుగైదు బేకరీ షాపులు నిర్వహిస్తూ వచ్చాడు. స్నేహితులు, పరిచయస్తుల వద్ద అయిన కాడికి అప్పులు తీసుకున్నాడు. కొంతకాలంగా బేకరీ షాపులను వరుసగా వదిలించుకుంటూ వస్తున్నాడు. మరో వైపు ఖాదర్‌ బాషాకు సన్నిహితురాలైన షామియానా కరంతుల్లా భార్య కామిన్నీసా రెండేళ్ల క్రితం సంతగేటు వద్ద కొత్తగా భవనం నిర్మించి సూపర్‌ బజారు మొదలు పెట్టింది. ఈమె కూడా  పలువురి వద్ద అప్పులు చేసింది. చాలామంది అధిక వడ్డీలకు ఆశపడి మోసపోయారని తెలు స్తోంది. ఇంకొందరు నగలు తాకట్టు పెట్టి మరీ అప్పులిచ్చారు. ఈ క్రమంలో గత శుక్రవారం కాదర్‌ బాషా, కామిన్నీసాకు చెందిన ఇరు కుటుంబాల వారూ భార్యా, భర్త, పిల్లలతో కలిసి వాహనాల్లో వెళ్లిపోయారు. గురువారం కొంత మంది మహిళలకు అనుమానం వచ్చి కామిన్నీసా ఇంటి కిటికీల నుంచి లోపలికి చూడగా ఇల్లు ఖాళీగా ఉం డడంతో మోసాన్ని గుర్తిఇంచారు. సమాచారం తెలిసిన కొంత మంది పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. వారం క్రితం కొన్ని ఫంక్షన్లకు హాజరు కావలసి ఉందని చెప్పి అప్పటికప్పుడు కొంత మంది పరిచయస్తుల నుంచి నగలు కూడా తీసుకెళ్లినట్లు బాధితలు లబోదిబోమంటున్నారు. కాగా ఒక్కొక్కరు రూ. ఐదు నుంచి యాభై లక్షల వరకూ అప్పులిచ్చిన వారిలో వున్నట్లు సమాచారం. పట్టణంలో తెలిసిన వారు మాత్రమే ప్రస్తుతం స్టేషన్‌కు వచ్చారు. సమీప ప్రాంతాల్లో ఇంకా ఇంకా ఎవరైనా ఉంటే ఉదయం తెలిసే అవకాశం ఉందని అప్పుడు ఎంతమేర మోసం చేశారో స్పష్టత వస్తుందని ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి తెలియజేశారు.  

Advertisement
Advertisement