ఫేస్‌బుక్‌లో దోస్తీ... భారత్ అంతా తిరుగుదామంటూ నిలువు దోపిడీ!

ABN , First Publish Date - 2020-10-24T17:30:50+05:30 IST

దేశరాజధాని ఢిల్లీకి ఆనుకునివున్న యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఒక మోసపూరిత ఉదంతం వెలుగు చూసింది. గ్రెనోలో ఉంటున్న...

ఫేస్‌బుక్‌లో దోస్తీ... భారత్ అంతా తిరుగుదామంటూ నిలువు దోపిడీ!

గ్రేటర్ నోయిడా: దేశరాజధాని ఢిల్లీకి ఆనుకునివున్న యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఒక మోసపూరిత ఉదంతం వెలుగు చూసింది. గ్రెనోలో ఉంటున్న ఒక రిటైర్డ్ అధికారితో తాను లండన్ నివాసిని అని చెబుతూ ఒక యువతి ఫేస్‌బుక్ సాయంతో స్నేహం చేసింది. తరువాత సదరు రిటైర్డ్ అధికారికి రూ. 50 లక్షలకు టోకరా వేసింది. 


 తాను భారత్ వస్తున్నానని ఆ రిటైర్డ్ ఉద్యోగికి చెప్పింది. తరువాత కరెన్సీ ఎక్ఛేంజి చేసుకునేందుకు సమయం పడుతున్నదని చెబుతూ, పలుమార్లు తన అకౌంట్‌లో ఆ యువతి ఆ రిటైర్డ్ అధికారి నుంచి డబ్బులు జమ చేయించుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ యువతి తనకు బహుమతులు పంపించేదని, తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు  చేసిందని పేర్కొన్నారు. గ్రెనోలోని స్వర్ణ నగరి సెక్టార్‌లో ఉంటున్న ఆర్ఎస్ పుండియా ఢిల్లీ డీడీఏలో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. పుండియాకు 2019లో పరిచయమైన ఒక యువతి తాను బారత్ వచ్చి, అన్ని ప్రాంతాలు చూడాలనుకుంటున్నానని అతనితో చెప్పింది. తరువాత తన నుంచి బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులు వసూలు చేసి, తరువాత ఫోన్ చేయడం మానేసిందని తెలిపారు. పుండియా నుంచి అందిన ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-10-24T17:30:50+05:30 IST