70 పరిశ్రమలు సీజ్‌

ABN , First Publish Date - 2020-06-04T09:07:21+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శాస్త్రీపురం కాలనీలో జనావాసాల మధ్య ఉన్న సుమారు 70

70 పరిశ్రమలు సీజ్‌

హసన్‌నగర్‌/రాజేంద్రనగర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శాస్త్రీపురం కాలనీలో జనావాసాల మధ్య ఉన్న సుమారు 70 పరిశ్రమలను బుధవారం గ్రేటర్‌ దక్షిణ మండలం అధికారులు సీజ్‌ చేశారు. వాటికి విద్యుత్‌ శాఖ అధికారులు కరెంటును తొలగించారు.  రెసిడెన్షియల్‌ కాలనీలో ఉన్న పరిశ్రమలతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శాస్త్రీపురం హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ 2012లో హైకోర్టులో కేసు వేసింది. అప్పటి నుంచి జరుగుతున్న విచారణలో నివాస స్థలాల మధ్య ఉన్న పరిశ్రమలను తొలగించాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.


గతంలో 13 పరిశ్రమలను జీహెచ్‌ఎంసీ అధికారులు మూసివేశారు. 25 వరకు పరిశ్రమలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన  పరిశ్రమలను కూడా  మూసివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం గ్రేటర్‌ దక్షిణ మండలం జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్‌లు డి.ప్రదీప్‌కుమార్‌, సూర్యకుమార్‌, శెర్లీ పుష్పరాగం, మంగతాయారు, జగన్‌, సతీశ్‌రెడ్దిలతో పాటు అసిస్టెంట్‌  లైజన్‌ ఆఫీసర్‌ ఆంజనేయులు,  టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది, పోలీసులు, ఎలక్ట్రికల్‌ సిబ్బంది సుమారు 70 పరిశ్రమలను సీజ్‌ చే శారు. ఈ సందర్భంగా పోలీసులతో కొందరు పరిశ్రమల నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. 


Updated Date - 2020-06-04T09:07:21+05:30 IST