819 మందికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-05-07T17:31:00+05:30 IST

జిల్లాలో గురువారం కొత్తగా మరో 819 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన డీ

819 మందికి కరోనా పాజిటివ్

         - కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ 


రాయచూరు(కర్ణాటక): జిల్లాలో గురువారం కొత్తగా మరో 819 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన డీసీ, ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 24, 988 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. తాజాగా గురువారం 819 కరోనా సెకెండ్‌ వేవ్‌ పాజిటివ్‌ కేసులుగా గుర్తించామన్నారు. గురువారం ముగ్గురు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 180 మంది మృతి చెందినట్లు వివరించారు. 565 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని. ఇంకా 819 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు.    


ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తాం

జిల్లాలో కొవిడ్‌ బాధితులకు చికిత్సనందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేటు ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి కొంతమేర ఉత్పత్తి నిలిచిపోయినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఇప్పటికే సాంకేతిక సమస్యలను సరి చేసి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారని ఎక్కడ ఏ ఆస్పత్రిలోను ఆక్సిజన్‌ కొరత లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలోని మూడు ప్రైవేటు ఫ్యాక్టరీల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపిన డీసీ బళ్లారి నుంచి కూడా ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను జిల్లాకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్‌ విషయంలో రోగులు వారి బంధువులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - 2021-05-07T17:31:00+05:30 IST