పింఛన్ల పంపిణీ 86 శాతమే..!

ABN , First Publish Date - 2021-08-03T06:48:26+05:30 IST

సోమవారం నాటికి 4,38,846 మందికి (86.89 శాతం) మాత్రమే పింఛన్లను పంపిణీ చేశారు.

పింఛన్ల పంపిణీ 86 శాతమే..!

చిత్తూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన సామాజిక పింఛన్లను అందిస్తామంటున్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతోంది. ఈనెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్ల సొమ్ము సచివాలయ సిబ్బందికి పూర్తిస్థాయిలో అందకపోవడంతో తొలి రోజు పంపిణీ కేవలం 78 శాతంగా జరిగింది. సోమవారం కూడా ఆశించిన స్థాయిలో పంపిణీ జరగలేదు. 5,05,061 మందికిగానూ సోమవారం నాటికి 4,38,846 మందికి (86.89 శాతం) మాత్రమే పంపిణీ చేశారు. సాధారణంగా ప్రతి నెలా తొలి రోజే 95 నుంచి 98 శాతం పింఛన్ల పంపిణీ జరిగి, జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేది. తొలి రోజు రాష్ట్రంలో 8వ స్థానంలో ఉండగా.. రెండోరోజు పదో స్థానానికి పడిపోయింది. 

Updated Date - 2021-08-03T06:48:26+05:30 IST