మళ్లీ పెరిగిన పాజిటివ్‌ కేసులు.. ఒకేరోజు 96 మందికి నిర్ధారణ

ABN , First Publish Date - 2020-04-10T14:24:22+05:30 IST

గత వారం రోజుల్లో బుధవారం తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కాస్త ఊరట చెందేలోపే

మళ్లీ పెరిగిన పాజిటివ్‌ కేసులు.. ఒకేరోజు 96 మందికి నిర్ధారణ

  • 834కు పెరిగిన కరోనా బాధితులు
  • 27 మంది డిశ్చార్జి

చెన్నై): గత వారం రోజుల్లో బుధవారం తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కాస్త ఊరట చెందేలోపే గురువారం మళ్లీ భారీగా కేసులు పెరిగాయి. ఒకేరోజు 96 మందికి కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 834కి చేరింది. ఇప్పటివరకు 27 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక కొత్తగా నమోదైన 96 కేసులో 84 మంది ఢిల్లీ మహానాడులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్ట్‌తో ఉన్న వారివే. చెన్నైలో తాజాగా ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షల వివరాలను ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ గురువారం సాయం త్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59,918 మంది హోమం క్వారంటైన్‌లో, 211 మంది ప్రభు త్వ వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, 32,796 మంది హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకు న్నారని చెప్పారు. ఇప్పటివరకు 7,267 నమూనాలు పరీక్షించామని, గురువారం కొత్త 96 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 


ఇక గురువారం 50వేల ర్యాపిడ్‌ కిట్‌ టెస్ట్‌లు రాష్ట్రానికి వచ్చాయని, శుక్రవారం నుంచి ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహిం చబోతున్నామని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు కరోనా వైరస్‌ తీవ్రతను గుర్తించి ప్రభుత్వ సూచనలను పాటించాలని, తరచు గా చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజి క దూరం పాటించాలని, లక్షణా లుంటే వెంటనే ఆస్పత్రికి వచ్చి చికిత్సలు పొందాల ని బీలా రాజేష్‌ విజ్ఞప్తి చేశారు. ఇకపోతే, రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల గణాంకాలు పరిశీలిస్తే.. ఢిల్లీ మహానాడులో పాల్గొని రాష్ట్రానికి తిరిగొచ్చిన వారు, కాంటా క్ట్‌లో ఉన్నవారు 1,480 మంది ఆయా ప్రాం తాల్లోని ఆస్పత్రులకు వెళ్లి కరోనా పరిశోధన లు చేయించుకున్నారు. వీరిలో 763 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అందులో 554 మంది డైరెక్టుగా ఢిల్లీ వెళ్లివచ్చినవారు కాగా, 188మందికి వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారు.


నేడు డాక్టర్లతో సీఎం సమీక్ష

కరోనా వైద్య చికిత్సలు, వైద్యులకు అవసరమైన వసతులు తదితరాల విషయమై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరుపనున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సలకు సంబంధించిన వైద్య సేవల పర్యవేక్షణకు ప్రభుత్వం నియమించిన ఉన్నత వైద్య కమిటీలోని 19 మంది సభ్యులతో సీఎం ఎడప్పాడి  చర్చిస్తారు.

Updated Date - 2020-04-10T14:24:22+05:30 IST