Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరోసారి కాసుల వర్షం.. 9999 Fancy Number ధర అక్షరాలా...!

హైదరాబాద్‌ సిటీ : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సెంట్రల్‌ జోన్‌ కార్యాలయంలో మరోసారి కాసుల వర్షం కురిసింది. మంగళవారం జరిగిన వేలంపాటలో ఆల్‌టైం ఫ్యాన్సీ నెంబర్‌ ఆల్‌ నైన్‌ (టీఎస్‌09 ఎఫ్‌టీ-9999) అత్యధికంగా రూ. 20.10 లక్షల ధర పలికింది. కీస్టోన్‌ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ ఆ నెంబరు దక్కించుకున్నట్లు రవాణాశాఖాధికారులు వెల్లడించారు. మరో నెంబర్‌ (టీఎస్‌09 ఎఫ్‌యూ- 0009)కు రూ. 7.95 లక్షలు వెచ్చించి ఎపిటోమ్‌ ప్రాజెక్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ చేజిక్కించుకుంది. టీఎస్‌ 09 ఎఫ్‌-0001ను పి.రాధికారెడ్డి రూ.3.08లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మంగళవారం వేలం పాటలో మొత్తం రూ. 46.15లక్షల ఆదాయం వచ్చిందని జేటీసీ పాండురంగా నాయక్‌ తెలిపారు. 

Advertisement
Advertisement