లేవరా.. కళ్లు తెరువు అంటూ ఏడుస్తూ పిలుస్తుండగానే తల్లి ఒడిలోనే కన్నుమూసిన 5 ఏళ్ల బాలుడు.. ఆస్పత్రి ముందే దారుణం..!

ABN , First Publish Date - 2022-09-01T22:20:16+05:30 IST

తల్లి ప్రేమకు సాటి మరేదీ ఉండదు. తన కోరికలు, ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి.. పిల్లల ఇష్టమే తమ ఇష్టంగా జీవితాంతం బతుకు వెళ్లదీస్తారు. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు..

లేవరా.. కళ్లు తెరువు అంటూ ఏడుస్తూ పిలుస్తుండగానే తల్లి ఒడిలోనే కన్నుమూసిన 5 ఏళ్ల బాలుడు.. ఆస్పత్రి ముందే దారుణం..!

తల్లి ప్రేమకు సాటి మరేదీ ఉండదు. తన కోరికలు, ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి.. పిల్లల ఇష్టమే తమ ఇష్టంగా జీవితాంతం బతుకు వెళ్లదీస్తారు. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటిది కళ్ల ముందే తమ పిల్లలు కానరాని లోకానికి వెళ్లిపోయారు.. అనే వార్త తెలిస్తే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. లేవరా.. కళ్లు తెరువు అని తల్లి ఏడుస్తూ పిలుస్తుండగానే.. తన ఐదేళ్ల కుమారుడు ఒడిలోనే కన్నుమూశాడు. దీంతో ఆమె విలవిల్లాడిపోయింది. ఆస్పత్రి ఎదుటే జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్‌పూర్ జిల్లా బార్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (Primary Health Centre) బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు కథనం మేరకు.. బార్గికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిన్హేటా గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడికి బుధవారం ఉదయం వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన బార్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే ఉదయం 10గంటలు దాటినా వైద్యులు అందుబాటులో లేరు. దీంతో రాత్రి 12వరకూ అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. దీంతో బాలుడి పరిస్థితి విషమించి.. తల్లి ఒడిలోనే ప్రాణాలొదిలాడు. ఒక్కసారిగా బాలుడు అచేనంగా మారడంతో.. లేవరూ, కళ్లు తెరువు అంటూ తల్లి ఏడుస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా.. అయ్యో! ఎంత ఘోరం జరిగిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు.

road accident: అయ్యో..! సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చినా దక్కని ఫలితం.. చివరకు అంబులెన్స్ డోర్స్ కారణంగా..


చిన్నారి మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమంటూ బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. చివరకు ఈ విషయం ఉన్నతాధికారులతో పాటూ వైద్యారోగ్య శాఖ మంత్రి వరకూ వెళ్లింది. ఈ అంశంపై విచారణకు ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారికి తీవ్రమైన అనారోగ్యం ఏమీ లేదన్నారు. బాలుడి కాలు కాలిపోవడంతో పది రోజులుగా చికిత్స పొందుతున్నారని, అయితే ఇన్ఫెక్షన్ పెరిగిపోయిన కారణంగా చనిపోవడం జరిగిందని వివరించారు. ఈ ఘటనపై తన ఆవేదనను తెలియజేస్తూ.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్.. తన ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అమాయక చిన్నారి చనిపోయిందని పేర్కొన్నారు.

ఇంట్లో నగ్నంగా తల్లీకూతుళ్ల మృతదేహాలు.. 10 రోజుల తర్వాత కొడుకు రాకతో బయటపడిన దారుణం.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..



Updated Date - 2022-09-01T22:20:16+05:30 IST