Advertisement
Advertisement
Abn logo
Advertisement

దిందా వాగుపై వంతెన నిర్మించాలి

చింతలమానేపల్లి, డిసెంబరు 3: మండలం లోని దిందా వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం దిందా గ్రామంలో పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి దిందా వాగును సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోనప్ప మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు ప్రారంభించక పోవడం ఏమాత్రం బాగాలేదన్నారు. వంతెన నిర్మాణం చేపట్టకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడుతా మన్నారు. నాయకులు పోశన్న, తిరుపతి గౌడ్‌, శ్రీనివాస్‌, దిలీప్‌, ఓంకార్‌, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement