Crime News: ఆస్తి కోసం ఈ కూతురు వేసిన స్కెచ్ చూస్తే మతి పోతుంది.. చివరకు ఎంతకు తెగించావమ్మా...
ABN , First Publish Date - 2022-08-26T02:50:53+05:30 IST
ఆస్తి కోసం తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టే కొడుకులను రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలై.. ఆస్తి కోసం కుటుంబ సభ్యులను చివరకు చంపడానికి కూడా...
ఆస్తి కోసం తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టే కొడుకులను రోజూ చూస్తూనే ఉన్నాం. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలై.. ఆస్తి కోసం కుటుంబ సభ్యులను చివరకు చంపడానికి కూడా వెనుకాడరు. అందుకే కొడుకుల కంటే కూతుళ్లు ఉంటే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారని పెద్దలు అంటుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కూతురు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. ఇలాంటి కూతుళ్లు కూడా ఉంటారా.. అని ఛీకొట్టేంత పని చేసింది. ఆస్తి కోసం ఆమె వేసిన స్కెచ్ చూసి... చివరకు అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
కేరళ (Kerala) రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలో (Thrissur District) ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధి కున్నాంకులం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి 12ఏళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. వాటి నుంచి బయటపడేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ఏ కూతురూ కలలో కూడా చేయని నేరం చేయాలని ప్లాన్ వేసింది. తల్లిదండ్రులను అంతమొందిస్తే.. ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని కుట్రపన్నింది. అయితే పోలీసులకు దొరక్కుండా ఎలా చంపాలనే విషయంపై వివిధ రకాలుగా ఆలోచింది. చివరకు ఈనెల 18వ తేదీన టీలో ఎలుకల మందు కలిపి.. తల్లిదండ్రులకు అందించింది.
మద్యం మత్తులో ఉన్న భర్తకు భోజనం తెచ్చేందుకు బయటికి వెళ్లిన భార్య.. మరుక్షణం అర్ధ నగ్నంగా ప్రత్యక్షం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
తల్లి పూర్తిగా తాగేయగా, తండ్రి మాత్రం రుచి గమనించి పక్కన పడేశాడు. తర్వాత కాసేపటికి తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఇంకో ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎలుకల మందు కారణంగా ఆమె మృతి చెందిందని తెలియడంతో.. చివరకు కూతురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో గురువారం ఆమెను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.