ఐదేళ్లుగా మహిళా టీచర్ వింత ప్రవర్తన.. ఓ రోజు ఫుల్ బాటిల్‌తో స్కూల్‌కు రావడంతో..

ABN , First Publish Date - 2022-09-10T02:07:35+05:30 IST

గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉన్న ఆమె.. ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తోంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి దారిలోకి తేవాల్సింది పోయి.. చివరకు ఆమే దారి తప్పింది. విద్యార్థుల..

ఐదేళ్లుగా మహిళా టీచర్ వింత ప్రవర్తన.. ఓ రోజు ఫుల్ బాటిల్‌తో స్కూల్‌కు రావడంతో..

గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉన్న ఆమె.. ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తోంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి దారిలోకి తేవాల్సింది పోయి.. చివరకు ఆమే దారి తప్పింది. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండేది. ఓ రోజు ఏకంగా ఫుల్ బాటిల్‌తో పాఠశాలకు వచ్చింది. దీంతో సహోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విసిగిపోయారు. చివరకు అధికారుల రంగప్రవేశంతో మహిళా టీచర్ షాక్‌కు గురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...


కర్ణాటకలోని తమకూరు తాలూకాలోని చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయురాలు.. 25 ఏళ్లుగా ఈ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తోంది. మొదటి నుంచి ఈమెపై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. అయితే ఐదేళ్లుగా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. మద్యానికి అలవాటుపడిన ఆమె.. రోజురోజుకూ ఎక్కువగా తాగడం మొదలెట్టింది. చివరకు ఫుల్‌గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చేది. ఈ క్రమంలో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ చీటికీమాటికీ తిట్టడం, కొట్టడం చేస్తుండేది.

ఆస్పత్రిలో మహిళల ప్రసవం.. అంతలోనే అనూహ్య ఘటన.. నా పిల్లలు కాదంటే నా పిల్లలు కాదంటూ.. చివరకు..


చివరకు ఈ విషయం తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. ఇంకోసారి తాగి వస్తే బాగుండదంటూ హెచ్చరించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల ఓ రోజు మద్యం బాటిళ్లతో పాఠశాలకు వచ్చింది. దీంతో సహోపాధ్యాయులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం టేబుల్ డ్రాలో పరిశీలించంగా మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఇలాంటి టీచర్ మాకు వద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

సైలెంట్‌గా ఇంట్లోకి దూరిన దొంగ.. చివరకు అతడు ఎత్తుకెళ్లిన వస్తువులను.. సీసీ కెమెరాలో చూసి అంతా షాక్..



Updated Date - 2022-09-10T02:07:35+05:30 IST