Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్‌

- మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా

    డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా

- జాతీయ స్థాయిలో  ప్రతిభ కనబరిచిన

   క్రీడాకారులకు సన్మానం

మక్తల్‌, డిసెంబరు 2 : క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని మహబూబ్‌నగర్‌ ఉ మ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా అన్నారు.  మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో గతనెల 21నుంచి 27వరకు నిర్వహించిన  జాతీయ స్థాయి క్రీడల్లో నారాయణ పే ట జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు నాలుగు బం గారు, 16వెండి, ఐదు కాంస్య పతకాలు సాధించారు. గురువారం క్రీడాకారులను శాలువాతో సన్మానించారు. అంతకుముందు మక్తల్‌ మినీ స్టేడియం నుంచి అంబే డ్కర్‌చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహిం చా రు. ఈ సందర్భంగా  డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, గౌరవ అధ్యక్షుడు రఘుప్రసన్నభట్‌, అధ్యక్షుడు గో పాలం మాట్లాడుతూ ప్రతీ క్రీడాకారుడు జాతీయ స్థా యిలో రాణించి తల్లిదండ్రులు, గురువులు, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.  20మంది క్రీడా కారులు జాతీయస్థాయిలో పతకాలు  సాధించడం  జిల్లాకే గర్వకారణం అన్నారు.  అలాగే శిక్షణ ఇచ్చిన పీఈటీ గోపాలంను డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టగ్‌ఆఫ్‌వార్‌ జిల్లా ఉపాధ్యక్షుడు థాన్‌సింగ్‌, శ్రీఽధర్‌రెడ్డి, దామోదర్‌, అంబ్రేష్‌, కృష్ణమూర్తి, అబ్దుల్‌ రౌఫ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement