Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యను పందెంగా కాసి ఆడిన జూదంలో ఓటమి.. భార్య ఒప్పుకోకపోవడంతో అతను ఏం చేశాడంటే..

ఎప్పుడో మహాభారత కాలంలో భార్యను పందెంగా కాసి జూదం ఆడడం గురించి విన్నాం. భార్యను పందెంగా కాసే మహానుభావులు ఇప్పటికీ ఉన్నారని తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన రుజువు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా ప్రాంతానికి చెందిన యువకుడికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత అతను ఒక్కడే ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఇటీవల తన భార్య, బిడ్డను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాడు. 


అక్కడకు వెళ్లిన తర్వాత అతడి నిజ స్వరూపం అతడి భార్యకు తెలిసింది. స్నేహితులతో ఆడిన జూదంలో తనను పందెంగా కాసి ఓడిపోయాడని, వాళ్లకు అప్పగించేందుకే భర్త తనను అక్కడకు తీసుకు వచ్చాడని అర్థం చేసుకుంది. ఎలాగో తంటాలు పడి అక్కడి నుంచి తప్పించుకుని పుట్టింటికి చేరింది. భార్య బదులు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని పందెంలో గెలిచిన స్నేహితులు అడిగారు. దీంతో ఆ యువకుడు భార్య దగ్గరకు వెళ్లి రెండు లక్షల రూపాయలు అడిగాడు. 


అంత డబ్బు ఆమె దగ్గర, ఆమె తల్లిదండ్రుల దగ్గర లేదు. దాంతో వారు డబ్బు ఇవ్వలేదు. ఆ కోపంతో ఆ యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఆ యువతి తన కూతురితో కలిసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతోంది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement