బీజింగ్, మార్చి 1: డోక్లాం, తూర్పు లద్దాఖ్‌ల్లో భారత్‌తో ఘర్షణల సమయంలో దళాలను నడిపించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) కమాండర్ జనరల్ ఝావో జాంగ్‌క్వీకి అత్యున్నతమైన పార్లమెంటరీ కమిటీలో కీలక పదవిని కట్టబెట్టింది చైనా! 2017లో డోక్లాం ఘర్షణలో పశ్చిమ కమాండ్‌కు ఆయన నేతృత్వం వహించారు. 2020లో వాస్తవాధీన రేఖను పీఎల్‌ఏ అతిక్రమించి చొచ్చుకురావడంలోనూ ఆయనదే ప్రధాన భూ మిక. చైనా పార్లమెంట్- నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) విదేశీ వ్యవహారాల కమిటీ ఉపచైర్మన్‌గా ఆయనను నియమించారు. 65 ఏళ్ల ఝావో పీఎల్‌ఏలో రిటైరైన వెంటనే ఈ పదవినిచ్చారు. ఈనెల 5నుంచి ఎన్‌పీసీ సమావేశాలు జరగనున్నాయి. అత్యంత ప్రభావవంతమైన కమిటీల్లో విదేశాంగ కమిటీ ఒకటి.