Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆగి ఉన్న గూడ్సు రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నం.. సడన్‌గా కదిలిన రైలు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే అతడు ఆఫీస్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకూ విధులు నిర్వర్తించాడు. సాయంత్రం అవడంతో ఇంటికి బయల్దేరాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన వెంటనే.. అతడికి కదలడానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ కనిపించింది. ఆ ట్రైన్ మిస్ అయితే.. ఇబ్బంది పడాల్సి వస్తుందని.. ఆగి ఉన్న గూడ్సు రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆగి ఉన్న గూడ్సు రైలు కదలింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే...


చత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ జోగన్(57) నిపానియా అనే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. హాత్బాద్ ప్రాంతంలో ఉన్న తన ఇంటి నుంచి రోజూ ట్రైన్‌లో రాకపోకలు సాగిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోజు కూడా తాను ఎప్పటిలాగే విధులకు హాజరయ్యాడు. సాయంత్రం అయ్యాక తిరిగి ఇంటికి బయల్దేరాడు. రైల్వే స్టేషన్‌లో కదలాడికి సిద్ధంగా ఉన్న ట్రైన్‌ను చూసి, రామ్ జోగస్ కంగారుపడ్డాడు. ఎలాగైన ఆ రైలును అందుకోవాలని భావించి, రిస్క్ చేశాడు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందికి దూరి.. పట్టాలను దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ గూడ్స్ బండి కదిలింది. దీంతో రామ్ జోగన్ దాని కింద చిక్కుకుపోయాడు. చేసేదేమీ లేక ప్రాణ భయంతో పట్టాలపై వెల్లకిలా పడుకుండిపోయాడు. అయితే స్థానికులు అతడిని చూసి, రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో.. గూడ్సు బండిని లోకఫైలెట్ నిలిపివేశాడు. దీంతో రామ్ జోగస్.. గూడ్సు బండి కింది నుంచి బయటికొచ్చాడు. కాగా.. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement