Advertisement
Advertisement
Abn logo
Advertisement

తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి ఏముందో చూసి కంగుతిన్న డాక్టర్లు.. ఇదేం పనయ్యా అని అడిగితే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే దాన్ని అతడు లైట్ తీసుకున్నాడు. దానంతట అదే తగ్గిపోతుందిలే అని భ్రమ పడ్డాడు. కానీ అలా జరగలేదు సరికదా.. తాజాగా పెయిన్ మరింత ఎక్కువైంది. దీంతో.. భరించరాని నొప్పితో అతడు ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఎక్స్‌రే తీసి అతడి కడుపులో ఏముందో చూసిన వైద్యులు కంగుతిన్నారు. అనంతరం ఇదేం పనయ్యా అంటూ అతడిని అడిగి.. ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలు విని షాకయ్యారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


ఈజిప్ట్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఆ నొప్పిని అతడు నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు తీవ్ర కడుపు నొప్పితో దగ్గరలోని ఆసుపత్రిలో చేరాడు. దీంతో అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. ఎక్స్‌రే‌ను చూసి షాకయ్యారు. అతడి కడుపులో సెల్‌ఫోన్ ఉండటంతో డాక్టర్లు కంగుతిన్నారు. అనంతరం విషయం ఆరా తీసిన డాక్టర్లు.. అతడు చెప్పిన విషయాన్ని విని విస్తుపోయారు. ఆరు నెలల క్రితం తాను సెల్‌ఫోన్‌ను మింగానని.. అయితే అది మలం ద్వారా దానతంట అదే తన శరీరం నుంచి బయటికి వస్తుందని భావించినట్లు చెప్పడంతో డాక్టర్లు షాకయ్యారు.


అనంతరం డాక్టర్లు అతడిని మందలించి.. హుటాహుటిన శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే పలువురు డాక్టర్లు కొద్ది సమయం వరకూ శ్రమించి.. అతడి కడుపులోంచి సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. ఈ సందర్భంగా ఆశ్వాన్ యూనివర్సిటీ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఈ తరహా కేసును తాము మొదటిసారిగా చూసినట్లు వెల్లడించారు. కడుపులో సెల్‌ఫోన్ ఇతర ఆహారపదార్థాలకు అడ్డుగా మారడంతో అతడికి కడుపు నొప్పి వచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. అతడు సెల్‌ఫోన్‌ను ఎందుకు మింగాల్సి వచ్చిందనే అంశంపై సమాచారం లేదు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement