Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల సమస్యలపై సమరశీల పోరాటం చేయాలి

రావుల వెంకయ్య అభినందన సభలో వక్తలు 

కందుకూరు, నవంబరు 27 : భారత దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్‌.వెంకయ్య ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు కొనసాగాలని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, పలువురు వక్తలు ఆకాంక్షించారు. కందుకూరుకు చెందిన రావుల వెంకయ్య అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శనివారం కందుకూరులో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు రైతు సంఘాల నాయకులు కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, రైతు పాల్గొని వెంకయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో ముందుకు పోయారన్నారు. నేడు జాతీయ స్థాయిలో రైతుసంఘం బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకయ్య కందుకూరు ప్రాంతవాసి కావడం గర్వంగా ఉందన్నారు. ప్రకాశం ఇంజనీరింగ్‌  కళాశాల కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య,  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంధ్రనాద్‌, శ్రీపతిభ విద్యా సంస్ధల కరస్పాంటెండ్‌ నల్లూరి వెంకటేశ్వరు,  సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య, సీపీఎం నాయకులు ఎస్‌ఏ గౌస్‌, వివిధ సంఘాల నాయకలు దామా వెంకటేశ్వర్లు, పిడికిటి వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ సత్యనారాయణ, కంచర్ల శ్రీకాంత్‌, పాలేటి కోటేశ్వరరావు, సీహెచ్‌ ఆదినారాయణ, బూసి సురేష్‌, వై ఆనందమోహన్‌, పీ.బాలకోటయ్య, తదతరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement