Abn logo
Jul 24 2021 @ 14:56PM

ఆసుపత్రిలో చేరిన వ్యక్తి.. అతడి ముక్కు, చెవుల్ని ఎవరు కోశారో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

ముక్కు, చెవులు తెగిపోయి తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.. అతనికి వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు.. చికిత్స పూర్తయ్యాక అతడు చెప్పిన దాన్ని విని వైద్యులు షాకయ్యారు.. వివాహేతర సంబంధం గురించి తెలిసి తన ప్రేయసి భర్తే తన ముక్కు, చెవుల్ని కోసేశాడని చెప్పడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. 


ముజఫరానగర్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ్ తన భార్యతో రాసలీలలు సాగిస్తుండడం గురువారం అబ్దుల్ కంటబడింది. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్ ఓ కత్తి తీసుకుని అక్రమ్ ముక్కు, చెవులు కోసేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అక్రమ్‌ను హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా, అక్రమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రత్యేకంమరిన్ని...