6 నెలల గర్భిణి.. కత్తితో కడుపులో పొడుచుకుంది.. ఇంత దారుణానికి ఆమె పాల్పడటం వెనుక..

ABN , First Publish Date - 2022-04-21T02:53:14+05:30 IST

ఆమె ఆరు నెలల గర్భిణి. ఈ సమయంలో ఎవరైనా పుట్టబోయే బిడ్డ గురించి తలచుకుంటూ, పిల్లల భవిష్యత్‌పై కలలు కంటూ ఉంటారు. ఆ సమయంలో భర్త, అత్తమామలు కూడా గర్భిణిని ప్రేమగా...

6 నెలల గర్భిణి.. కత్తితో కడుపులో పొడుచుకుంది.. ఇంత దారుణానికి ఆమె పాల్పడటం వెనుక..

ఆమె ఆరు నెలల గర్భిణి. ఈ సమయంలో ఎవరైనా పుట్టబోయే బిడ్డ గురించి తలచుకుంటూ, పిల్లల భవిష్యత్‌పై కలలు కంటూ ఉంటారు. ఆ సమయంలో భర్త, అత్తమామలు కూడా గర్భిణిని ప్రేమగా చూసుకోవడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఆరు నెలల గర్భిణిగా ఉన్న ఆమె.. కత్తితో పొడుచుకుంది. ఆమె ఇంత దారుణానికి పాల్పడడం వెనుక.. అసలు కారణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బుద్వారి బస్తీలోని కుంభట్టా ప్రాంతంలో శివప్రసాద్ షా అనే వ్యక్తి.. భార్య మమతా షాతో కలిసి నివాసం ఉంటున్నాడు. మమతా ప్రస్తుతం ఆరు నెలల గర్భంతో ఉంది. ఇంతవరకు అన్యోన్యంగా ఉన్న వీరి కుటుంబంలో ఇటీవల తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. మమతపై లేనిపోని అనుమానాలు పెట్టుకుని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయంపై శని, ఆదివారాల్లో కూడా దంపతుల మధ్య గొడవలు జరిగాయి. అయితే సోమవారం ఏం జరిగిందో ఏమో తెలీదు గాని.. మమత ఉన్నట్టుండి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇంటి ముందే ఆగిన స్కూల్ వ్యాన్.. ఫ్రెండ్స్‌కు టాటా చెప్పి దిగిన 4 ఏళ్ల పిల్లాడికి అదే ఆఖరి మాటయింది.. మరు క్షణంలోనే..


ఈ సమయంలో అక్కడే ఉన్న భర్త.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని, వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. మమత తల్లిదండ్రులు గుజరాత్‌లో ఉంటారని, వారు వచ్చిన తర్వాతే పోస్టుమార్టానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక.. అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశానికి దారి తీసింది.

అమ్మా.. నాకు వేరే మార్గం లేదంటూ 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని ఘోరం.. ఆమె రాసిన లేఖలో..

Updated Date - 2022-04-21T02:53:14+05:30 IST