ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-05-19T17:17:15+05:30 IST
దైవం మానుష రూపేణ.. మనిషి రూపంలోనే దేవుడు ఉన్నాడనే ఈ సత్యాన్ని చాలామంది నిజం చేసి చూపిస్తుంటారు. కొందరు చనిపోయినా.. అందరి మనసుల్లో చిరస్థాయిగా...
దైవం మానుష రూపేణ.. మనిషి రూపంలోనే దేవుడు ఉన్నాడనే ఈ సత్యాన్ని చాలామంది నిజం చేసి చూపిస్తుంటారు. కొందరు చనిపోయినా.. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు. వారు చేసిన మంచి పనుల కారణంగానే దేవుడిలా పూజిస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలతో లేకున్నా ఐదుగురి ప్రాణాలను కాపాడింది. ప్రస్తుతం పాప బతికిలేకున్నా చాలా మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఏప్రిల్ 27 ఓ ఆరేళ్ల రోలీ అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ పాప తలలోకి దూసుకెళ్లడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు పాపను చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పాప బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు చెప్పారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. వైద్యులు పాప పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించడంతో చివరకు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు.
ఈ ఫొటోలోని అమ్మాయి వయసు ఎంతో ఊహించగలరా..? అసలు నిజం తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!
దీంతో చిన్నారి కాలేయం, మూత్రపిండాలు, కార్నియా, గుండె వాల్వ్‌ను వేర్వేరు వ్యక్తులకు అమర్చారు. రోలీ తండ్రి హరనారాయణ్ మాట్లాడుతూ తమ పాప చనిపోయినా బతికి ఉండాలనే ఉద్దేశంతో అవయవదానం చేసినట్లు తెలిపాడు. రోలీ తల్లిదండ్రులను ఎయిమ్స్ వైద్యులు అభినందించారు. అతి చిన్న వయసు గల వారు అవయవదానం చేయడం.. ఎయిమ్స్ చరిత్రలోనే ఇదే తొలిసారి అని తెలిపారు.