Advertisement
Advertisement
Abn logo
Advertisement

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

నంద్యాల, నవంబరు 28: జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కమిటీ ఆధ్వర్యంలో తొలి సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌ ఆర్చీ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల రహీమ్‌, ప్రధాన కార్యదర్శి జయరామ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు గులామ్‌ హుసేన్‌, కోశాధికారి మస్తాన్‌వలి, మండల కార్యదర్శి ఆరీఫ్‌, కర్నూలు అధ్యక్షుడు రవికుమార్‌, బీసీ నాయకులు ఉమా మహేశ్వర్‌, శివ నారాయణ పాల్గొన్నారు. నంద్యాల డీసీసీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పూలే దేశానికి చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వాసు, షేక్‌ అబ్దుల్లా, ఎస్‌ఎండీ రఫీ, చింతలయ్య, శివారెడ్డి, ప్రసాద్‌, అహమ్మద్‌ హుసేన్‌, రెడ్డి హుసేన్‌ పాల్గొన్నారు. 


శిరివెళ్ల: శిరివెళ్లలోని తెలుగు పేటలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మంగళి బాల వెంకట రమణ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి  నివాళి అర్పించారు. సమకాలీన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో లింగమయ్య, పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య, సీతమ్మ, తరుణ్‌ పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: ఓర్వకల్లులోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మానికి డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యపోగు సత్యం, జిల్లా నాయకులు చిరంజీవి, మండల నాయకులు నాగన్న, మద్దిలేటి, రామాంజినేయులు హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పూలే మహారాష్ట్రలో ప్రారంభించిన సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు డా.బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ లాంటి వారలకు సైతం పూలే గురువుగా నిలిచారన్నారు. Advertisement
Advertisement