Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడిన కొడుకు.. తల్లి పర్సనల్ ఫొటోలను లీక్ చేశాడు..

ఇంటర్నెట్ డెస్క్: ఆ 16ఏళ్ల కుర్రాడు ఫోన్‌కు బానిసయ్యాడు. తల్లి మొబైల్‌లో ఎప్పుడూ గేమ్స్ ఆడటమే అతడి పని. ఇలా గేమ్‌లు ఆడుకుంటూనే అపరిచిత వ్యక్తులతో అతడు పరిచయం పెంచుకున్నాడు. వారు అడిగిన సమాచారం అంతా ఇచ్చి.. చివరికి కుటుంబ పరువును బజారుకు ఇడ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన ఓ మహిళకు 16ఏళ్ల కుమారుడు ఉన్నాడు. చాలా మందిలాగే అతడు కూడా స్మార్ట్ ఫోన్‌కు బానిసైపోయాడు. భారత ప్రభుత్వం పబ్జీని బ్యాన్ చేసినప్పటికీ.. ఇంటర్నేషనల్ వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తన ఆటను కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన అంకిత్ (20).. అతడికి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో గంటల కొద్దీ పబ్జీ ఆడేవారు. వారిద్దరి మధ్య పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఫోన్‌లు చేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ రోజు అంకిత్.. ఆ పదహారేళ్ల కుర్రాడికి ఫోన్ చేశాడు. మెయిల్ ఐడీ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆ కుర్రాడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అంకిత్ ఆ పదహారేళ్ల కుర్రాడికి తెలియకుండానే.. అతడి ఫోన్‌ను హ్యాక్ చేశాడు. 


ఆ తర్వాత 16ఏళ్ల కుర్రాడి తల్లికి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి దొంగిలించాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి.. ఫోటోలు, వీడియోల గురించి చెప్పి, తాను చెప్పినట్లు చేయకపోతే వాటిని బయటపెడతానని బెదిరించాడు. తరచూ ఫోన్‌ చేస్తూ తనతో మాట్లాడాల్సిందిగా ఆమెను బలవంతం చేశాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. అంకిత్ ఫోన్‌ను లిఫ్ట్ చేయడం మానేసింది. ఈ క్రమంలో ఆగ్రహానికిలోనైన అంకిత్.. తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే.. ఫోటోలు, వీడియోలను బయటపెడతానని ఆమెను బెదిరించాడు. ఆ మాటలను విని భయాందోళనలకు గురైన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అంకిత్‌ను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement