ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి.. రూ.22 కోట్ల విలువైన కార్లను చోరీ చేసి.. పోలీసులకే ఓ దొంగ సవాల్

ABN , First Publish Date - 2022-02-24T23:05:40+05:30 IST

ఎంత పెద్ద దొంగ అయినా తాను చోరీ చేసిన విషయాన్ని బట్టబయలు చేయడు కదా! కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే దొంగ.. ఇందుకు పూర్తిగా విరుద్ధం. విలువైన కార్లను చోరీ చేసి, ‘‘ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి’’.. అంటూ..

ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి.. రూ.22 కోట్ల విలువైన కార్లను చోరీ చేసి.. పోలీసులకే ఓ దొంగ సవాల్

చోరీలు చేయడంలో ప్రస్తుతం దొంగలు ఆరితేరారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ పెద్ద పెద్ద చోరీలను కూడా ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు. కొన్నాళ్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగినా.. ఊచలు లెక్కించాల్సిందేనని చివరకు తెలుసుకుంటారు. అయితే ఎంత పెద్ద దొంగ అయినా తాను చోరీ చేసిన విషయాన్ని బట్టబయలు చేయడు కదా! కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే దొంగ.. ఇందుకు పూర్తిగా విరుద్ధం. విలువైన కార్లను చోరీ చేసి, ‘‘ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి’’.. అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం..


రాజస్థాన్ జైపూర్‌కు చెందిన సత్యేంద్ర షెకావత్ ఎంబీఏ పాసయ్యాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న తపన అతడిలో ఏమాత్రమూ లేదు. సులభంగా డబ్బు సంపాదించాలని నిత్యం ఆలోచించేవాడు. టెక్నాలజీ సాయంతో భారీ చోరీలను అత్యంత సులువుగా చేసేలా పక్కా ప్లాన్‌ను రూపొందించాడు. విలువైన కార్లను టార్గెట్ చేసి, వీటిని చోరీ చేసేందుకు రూ.25వేల విలువ చేసే పరికరాన్ని కొనుగోలు చేశాడు. మెర్సిడెజ్, బీఎమ్‌డబ్ల్యూ, టయోటా వంటి లగ్జరీ కార్లను.. తన వద్ద ఉన్న పరికరం సాయంతో చోరీ చేసేవాడు. పరికరానికి ఉన్న బటన్‌ను నొక్కడం ద్వారా కారు డోరు తెరిచేవాడు. గత నెలలో హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద పార్క్ చేసి ఉంచిన.. కన్నడ సినీ నిర్మాత మంజునాథ్‌కు చెందిన లగ్జరీ కారును చోరీ చేశాడు.

పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. భర్త బతిమిలాడినా నో రెస్పాన్స్.. ఆమె చెప్పింది విని..


ఆ కారుతో సహా నేరుగా రాజస్థాన్ వెళ్లి పోలీసులకు కాల్ చేశాడు. ‘‘నేను రాజస్థాన్‌లో ఉన్నా.. మీకు చేతనైతే పట్టుకోండి’’ అంటూ బెంగళూరు పోలీసులకు ఫోన్‌లో సవాల్ విసిరాడు. ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా అతను జైపూర్‌లో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న సత్యేంద్రను జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారు. 2009నుంచి ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, ఆగ్రా తదితర నగరాల్లో సుమారు రూ.22కోట్ల విలువైన 100 లగ్జరీ కార్లను చోరీ చేసినట్లు తెలిసింది. చోరీ చేసిన కార్లలో 50కార్లకు పైగా జోధ్‌పూర్‌లో విక్రయించినట్లు తెలిపాడు. గతంలో ఓసారి అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజుల తర్వాత విడుదలై.. మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. బెంగుళూరు, ఆగ్రా తదితర నగరాల్లోని మంత్రులు సహా పలువురు ప్రముఖుల కార్లను కూడా సత్యేంద్ర చోరీ చేసినట్లు విచారణలో తేలింది.

ట్యూషన్‌కు వచ్చిన బాలికను టార్గెట్ చేసిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో ఇలా చేస్తాడని ఊహించలేదు..

Updated Date - 2022-02-24T23:05:40+05:30 IST