Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral Photo: వేట కోసం పులి పొంచివుంది.. ఈ ఫొటోలో అదెక్కడుందో గుర్తుపట్టగలరా..?

‘‘పులి పలకరించింది కదా అని.. వెళ్లి పొటో దిగకూడదు’’.. అనే సినిమా డైలాగుకు ఈ ఫొటో అతికినట్లు సరిపోతుంది. మంచు కొడల్లో రాళ్ల మధ్య.. వేట కోసం కదలకుండా ఓ పులి పొంచి ఉంది. అదెక్కడుందో గుర్తుపట్టేందుకు ట్రై చేయండి. ఇది ఫజిల్ లాంటిదే.. కానీ నిజంగా మీరు ఆ ప్రాంతంలో ఉంటే మాత్రం పులికి దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే చాలా తీక్షణంగా చూస్తే తప్ప ఆ పులిని గుర్తుపట్టలేరు. అన్నీ రాళ్లేగా, పులెక్కడుందిలే అనుకుని వెళ్తే మాత్రం బలైపోతారు. వేట కోసం ఓ పులి రాళ్లలో కలిసిపోయి ఎదురు చూస్తోంది. అసలు అనుమానం రానంతగా ఉన్న ఈ దృశ్యాన్ని ఎవరో తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఆహారం కోసం పులులు, సింహాలు చేసే ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఈ ఫొటోలో కనిపిస్తున్న మంచుకొండల్లోని పులి.. వేట కోసం కదలకుండా ఎంత తీక్షణంగా ఉందో గమనిస్తే.. ఔరా అనిపిస్తుంది. ఏదైనా జంతువు అటుగా వెళ్లడమే ఆసల్యం.. దానికి బలవ్వాల్సిందే. కొంచెం కూడా అనుమానం రాకుండా రాళ్లలో కలిసిపోయింది మరి. మంచు ప్రాంతాల్లోని చిరుతలు.. ఎక్కువగా కొండల్లోనే సంచరిస్తుంటాయి. ఆహారం కోసం అవి ఇలా వినూత్నంగా ప్రయత్నిస్తుంటాయి. ఈ ఫొటోలోని పులిని గుర్తుపట్టలేని వారు కింద చూడొచ్చు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement