Abn logo
Oct 27 2021 @ 19:35PM

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల బదిలీల్లో ట్విస్ట్

హైదరాబాద్‌: నగరంలోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల బదిలీల్లో ట్విస్ట్ ఏర్పడింది. మరోసారి తన స్థానాన్ని జోనల్ కమిషనర్ మమత వదులుకోలేదు. కూకట్‌పల్లిని వీడేందుకు జోనల్‌ కమిషనర్‌ మమత విముఖత చూపుతున్నారు.  దీంతో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా కొనసాగిస్తూ మళ్లీ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న పంకజను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. గతంలో డిప్యూటీ కమిషనర్ హోదాలో చందానగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు బదిలీ చేయగా జాయిన్ కాకుండా శేరిలింగంపల్లికి మమత మార్పించుకున్నది.  

ఇవి కూడా చదవండిImage Caption