Viral Video: విద్యార్థులతో కలిసి టీచర్.. ఆటా, పాటా.. ఉపాధ్యాయులు అంటే ఇలా వుండాలంటున్న నెటిజన్లు..
ABN , First Publish Date - 2022-06-18T21:48:59+05:30 IST
తల్లి, తండ్రి తర్వాత గురువుకే అంతటి స్థానం ఉంటుంది. పిల్లలను పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అయితే, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది.. వారి భవిష్యత్తుకు బాటలు వేసేది..
తల్లి, తండ్రి తర్వాత గురువుకే అంతటి స్థానం ఉంటుంది. పిల్లలను పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అయితే, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది.. వారి భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులు మాత్రమే. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉంటూ, ఆటపాటలతో విద్యాబోధన చేస్తుంటారు. అలాంటి ఉపాధ్యాయులంటే విద్యార్థులకు కూడా ఎంతో గౌరవం ఉంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే టీచర్ కూడా ఆ కోవకే చెందుతుంది. పిల్లలతో కలిసి ఆటపాటలతో సరదాగా గడుపుతున్న ఆమెను చూసి.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల టీచర్ మను గులాటి ఈ వీడియోను షేర్ చేశారు. వేసవి శిబిరం చివరి రోజున ఆమె తన విద్యార్థులతో కలిసి సరదాగా నృత్యం చేసింది. విద్యార్థులంతా ఒకరి వెనుక ఒకరు డ్యాన్స్ చేస్తూ ముందుకు వెళ్తారు. వారి మధ్యలో టీచర్ కూడా నృత్యం చేస్తూ వారిని మరింత ఎంకరేజ్ చేస్తుంది. విద్యార్థులు కూడా తమ టీచర్‌తో సరదాగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘ వేసవి శిబిరం చివరి రోజున మేము చేసిన ఈ నృత్యం.. మాకు మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది’’ అని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి టీచర్ ఉంటే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది.. అంటూ ఒకరు కామెంట్ చేయగా.. కేవలం చదువు చెప్పడమే కాకుండా అప్పుడప్పుడూ ఇలా విద్యార్థులకు ఆటపాటలు కూడా నేర్పించాలి.. అంటూ మరొకరు పేర్కొన్నారు. మిగతా ఉపాధ్యాయులంతా ఈ టీచర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.. అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.