Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరాసరి యువతి గదిలోకి వెళ్లిన యువకుడు.. కూతురి అరుపులతో పరుగెత్తుకెళ్లిన తల్లిదండ్రులు అక్కడ జరిగింది చూసి షాక్

ఇంటర్నెట్ డెస్క్: 23ఏళ్ల వయసున్న ఓ యువతి తన గదిలో కూర్చిని.. ఏదో పని చేసుకుంటోంది. ఇంట్లేనే ఉన్న ఆ యువతి తల్లిదండ్రులు.. వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే 25ఏళ్ల వయసున్న యువకుడు.. సరాసరి ఆ యువతి గదిలోకి వెళ్లాడు. అనంతరం దారుణానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కూతురు కేకలను విన్న తల్లిదండ్రులు.. ఆ యువతి గదికి పరుగెత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి షాకయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


23ఏళ్ల ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి కోత్వాలీ ప్రాంతంతో ఉంటోంది. ఆజమ్ ఖాన్ (25) కూడా అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే ఆజమ్ ఖాన్.. సదరు యువతిని చూసి ఇష్టపడ్డాడు. కొద్ది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేశాడు. అయితే సదరు యువతి అతడికి నో చెపింది. అయినప్పటికీ ఆజమ్ ఖాన్ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. రోజు ఆమెను వెంబడించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే సదరు యువతి.. ఆజమ్ ఖాన్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తన వెంటపడి ఇబ్బంది పెడితే.. సహించబోనని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆజమ్ ఖాన్.. తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఓ తుపాకీని చేతిలో పట్టుకుని.. సరాసరి సదరు యువతి గదిలోకి ప్రవేశించేడు.


అనంతరం ఆమెను దానితో కాల్చి చంపేశాడు. కాగా.. పేలుడు శబ్దం, కూతురి కేకలను విన్న తల్లిదండ్రులు హుటాహుటిన సదరు యువతి గది వద్దకు చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న కూతురును, చేతిలో తుపాకీతో ఉన్న ఆజమ్ ఖాన్‌ను చూసి వారు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం తలుపులు మూసి, ఆజమ్ ఖాన్‌ను బంధించి.. పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆజమ్ ఖాన్.. తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement