నా భర్త నన్ను తిట్టాడు.. అంటూ పెళ్లయిన ఎనిమిదో రోజే ప్రియుడికి ఫోన్ చేసి చెప్పిందో భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN , First Publish Date - 2021-12-16T23:37:07+05:30 IST
బీహార్‌లో ఓ మహిళ పెళ్లయిన ఎనిమిదో రోజే ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్త కొడుతున్నాడంటూ చెప్పింది. చివరకు వారి కుటుంబంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..
బలవంతపు పెళ్లిళ్లు చాలా వరకు నిత్యం కలహాలమయంగా మారుతుంటాయి. ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. పరువు పోతుందనే ఉద్దేశంతో కొందరు తమ కుమార్తెలకు బలవంతంగా పెళ్లి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ఇష్టం లేకున్నా సర్దుకుపోయి.. సంసారం చేస్తుంటారు. మరికొందరైతే ఇష్టం లేని భర్తతో ఉండలేక, ప్రియుడితో కలిసి వెళ్లిపోతుంటారు. బీహార్‌లో ఓ మహిళ పెళ్లయిన ఎనిమిదో రోజే ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్త కొడుతున్నాడంటూ చెప్పింది. చివరకు వారి కుటుంబంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..
బీహార్‌లోని కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శివాని కుమారి అనే యువతికి ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమింకునేవారు. ఓ రోజు విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. తమ కూతురి ప్రేమ వ్యవహారం బయట తెలిస్తే.. పరువుపోతుందని భావించారు. వెంటనే పెళ్లి సంబంధం చూసి, డిసెంబర్ 7న వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్న శివాని.. అత్తగారింట్లో రోజూ అసంతృప్తిగానే ఉండేది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తాయి.
ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్య.. వెనుకే గమనిస్తూ వెళ్లిన భర్త.. అక్కడ ఇద్దరినీ చూసి..
గొడవలు ఎక్కవవడంతో పెళ్లయిన ఎనిమిదో రోజే ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్త రోజూ కొడుతున్నాడంటూ చెప్పింది. తనను ఎలాగైనా తీసుకెళ్లి, పెళ్లి చేసుకోవాలని తెలిపింది. ఇద్దరూ మాట్లాడుకుని ఓరోజు బయటికి వెళ్లి.. ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. తమ వివాహ తంతును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ మేము ప్రేమ వివాహం చేసుకున్నాం.. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ అధికారులను వేడుకున్నారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.