పొలంలో పశువులు మేపుతున్న మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా ఓ చెట్టు వద్ద కనిపించిందో షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2021-12-10T22:19:31+05:30 IST

ఆమె పొలంలో ఆవులు మేపుకొనేందుకు వెళ్లింది. పొద్దున నుంచీ ఆవులను మేపిన ఆమె సాయంత్రం ఇంటి దారి పట్టింది. ఊరికి సమీపిస్తుండగా చీకటి పడింది. కనుచూపుమేరలో ఊరు ఉందనగా.. రోడ్డు పక్క చెట్టు వద్ద ఏదో..

పొలంలో పశువులు మేపుతున్న మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా ఓ చెట్టు వద్ద కనిపించిందో షాకింగ్ సీన్..

ఆమె పొలంలో ఆవులు మేపుకొనేందుకు వెళ్లింది. పొద్దున నుంచీ ఆవులను మేపిన ఆమె సాయంత్రం ఇంటి దారి పట్టింది. ఊరికి సమీపిస్తుండగా చీకటి పడింది. కనుచూపుమేరలో ఊరు ఉందనగా.. రోడ్డు పక్క చెట్టు వద్ద ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. తీక్షణంగా చూడగా.. ఆ చెట్టు కింద ఏదో కుండ ఉండడం చూసి షాక్ అయింది. అదేంటో తెలుసుకోవాలని భయం భయంగానే దగ్గరి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక కనిపించిన సీన్ చూసి దిగ్భ్రాంతికి గురైంది...


మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లా భూయిమాడ్ పోలీస్ స్టేషన్‌ పరిధి కరిల్ గ్రామ పంచాయతీ బెండన్ గ్రామంలో లోలార్ సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి రాంపాల్ సింగ్(18) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేకుండా సంతోషంగా జీవించేవారు. అయితే ఇటీవల ఏం జరిగిందో ఏమోగానీ వారి కుమారుడు రాంపాల్ సింగ్.. రోజూ ఆందోళనతో ఉండేవాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుమారుడి ఆచూకీ కోసం తెలిసిన వారి వద్ద విచారించారు. అయినా ఫలితం లేదు.

రైల్లో వెళ్తున్న ఓ ప్రయాణికుడికి సడన్‌గా గుండెపోటు.. తల్లిని తీసుకెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిన ఓ యువతి చూసి..


ఆవులు మేపుకొనేందుకు వెళ్లిన మహిళ.. ఇంటికి చేరుకునే క్రమంలో రోడ్డు పక్క చెట్టు కింద కుండ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అదేంటో కనుక్కోవాలని భయంభయంగా దగ్గరికి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్తే.. చెట్టు పైన ఓ యువకుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దిగ్భ్రాంతికి గురై వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించింది. మృతుడు రాంపాల్ సింగ్‌ను గుర్తించిన గ్రామస్తులు.. కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కుండ సాయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బీటెక్ పూర్తి కాకుండానే రూ.20 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఆర్మీలో చేరాలన్న మక్కువతో రిజెక్ట్ చేసి మరీ..

Updated Date - 2021-12-10T22:19:31+05:30 IST