Advertisement
Advertisement
Abn logo
Advertisement

షాకింగ్: ప్రియుడి కళ్లల్లో ఆనందం చూసేందుకు అతడి తండ్రిని పెళ్లి చేసుకున్న ప్రియురాలు

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తి ముఖంలో నవ్వులను చూసేందుకు ప్రపంచంలో ఏ ప్రియురాలు చేయలేని పని చేసింది. పెళ్లి చేసుకుని ప్రియుడికి భార్య కావాల్సిన ఆ యువతి.. అతడికి తల్లి అయింది. నమ్మశక్యం కానప్పటికీ ఇది వాస్తవం. ప్రస్తుతం చర్చనీయాంశం అయిన ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 


టిక్‌టాక్ యూజర్ @ys.amri తాజాగా సోషల్ మీడియాలో సంచలన ప్రటకన చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో మునిగిపోయిన ప్రియుడి ముఖంలో మళ్లీ చిరునవ్వులు చూడటం కోసం, తల్లి లేదనే బాధను దూరం చేసేందుకు అతడికి తల్లిగా మారినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘నా బాయ్‌ఫ్రెండ్ తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయారు. దీంతో అతడు తీవ్రంగా బాధపడుతున్నాడు. అతడిని అలా నేను చూడలేకపోయాను. ఎలాగైనా అతడి ముఖంలో మళ్లీ సంతోషం చూడాలనుకున్నాను. అందుకే అతడి తండ్రిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, నా బాయ్‌ఫ్రెండ్‌కు తల్లిగా మారాలనుకున్నాను’ అని పేర్కొంది. ఈ వార్త నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ఆమె చేసిన త్యాగాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 



ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement