Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. తెల్లారాక చుట్టుపక్కవారు ఆమెకు ఆ విషయం చెప్పేసరికి..

హరియాణాలోని పానిపత్‌ పట్టణంలో ఒక యవకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. మృతుడిని అర్జున్(25)గా గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టు మార్టం కోసం సివిల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్జున్ సజాన్‌పూర్ గ్రామానికి చెందినవాడు. రెండేళ్లుగా అతను పానీపత్‌లో భార్యతో పాటు ఉంటున్నాడు. కాగా ఇటీవల ఒకరోజు రాత్రి భార్యా భర్తల మద్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో అర్జున్ ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి దాటినా ఇంటికి తిరిగిరాలేదు. ఉదయం చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మృతునికి మూడేళ్ల క్రితమే వివాహం అయ్యింది. ఈ దంపతులకు పిల్లలు లేరు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement