Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి వేళ WhatsApp Message.. న్యూడ్ కాల్స్ వరకూ వెళ్లిన యవ్వారం.. ఆ తర్వాత జరిగింది తెలిసి యువకుడు షాక్

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులతో ఆ యువకుడు సరదాగా గడుపుతున్నాడు. ఇంతలో అతడి ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. కొత్త నెంబర్ నుంచి వచ్చిన ఆ మెసేజ్‌ను చూసిన యువకుడు.. తనకు ఆ నెంబర్ ఓ యువతిదిగా గుర్తించాడు. ఈ క్రమంలోనే ఆమెతో చాట్ చేయడం ప్రారంభించాడు. చాటింగ్ కాస్తా క్రమేనా ఫోన్‌కాల్స్ వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో అదే నెంబర్ నుంచి ఓ వీడియో కాల్‌ను రిసీవ్ చేసుకున్న యువకుడు.. ముందూ వెనకా ఆలోచించకుండా చేసిన ఓ పని అతడి కొంప ముంచింది. కుటుంబ పరువు బజారెక్కే పరిస్థితి తెచ్చుకున్న ఆ యువకుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫోన్‌కు గత నెల 15న రాత్రి ఓ కొత్త నెంబర్ నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఇదేదో కొత్త నెంబర్ నుంచి నాకెవరు మెసేజ్ పంపుంటారూ.. అనుకుంటూనే అతడు ఆ సందేశాన్ని ఓపెన్ చేశాడు. ఆ క్రమంలోనే ‘మీరెవరూ నాకు మెసేజ్ పంపించారు’ అని చంద్రశేఖర్ ఆ సందేశానికి రిప్లై ఇచ్చాడు. దీంతో అవతలి వాళ్లు తమను తాము ఓ యువతిగా పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్.. ఆ యువతితో చాట్ చేయడం ప్రారంభించాడు. చాటింగ్ కాస్తా ఫోన్ కాల్స్ వరకూ వెళ్లింది. ఓ రోజు ఆ నెంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో.. చంద్రశేఖర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అనంతరం అవతలి వాళ్లు న్యూడ్‌గా ఉన్నట్లు భావించిన చంద్రశేఖర్.. తాను కూడా బట్టలను ఇప్పేసి, న్యూడ్‌గా ఫోన్ ముందు కూర్చున్నాడు. అంతే.. ఆ పనే అతడి కొంపముంచింది. 


ఆ వీడియో కాల్ తర్వాత వచ్చిన ఫోన్ కాల్‌‌ను చంద్రశేఖర్ లిఫ్ట్ చేసి.. అవతలి వాళ్లు చెప్పింది విని కంగుతిన్నాడు. ఇంతకాలం తాను ఫోన్‌లో మాట్లాడింది యువతితో కాదని తెలసుకుని షాకయ్యాడు. అంతేకాకుండా తన న్యూడ్‌ వీడియో కాల్‌కు సంబంధించిన దృశ్యాలను అవతలి వాళ్లు రికార్డు చేసినట్లు గుర్తించి విస్తుపోయాడు. డబ్బులివ్వకపోతే ఆ వీడియోను బయటపెడతామని అవతలి వాళ్లు బెదిరించడంతో చంద్రశేఖర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో సుమారు రెండున్నర లక్షలను వారికి ముట్టజెప్పాడు. అయినా వారి నుంచి వేధింపులు ఆగకపోవడంతో చంద్రశేఖర్.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement