ఇష్టం లేదని చెబితే అర్థం చేసుకుంటాడులే అనుకుంది.. కానీ రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2022-08-21T01:28:19+05:30 IST

చాలా ప్రేమ వ్యవహారాలు (love affairs) చివరకు విషాదాంతం అవుతుంటాయి. ప్రేమించిన వారిని అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ప్రేమికులు...

ఇష్టం లేదని చెబితే అర్థం చేసుకుంటాడులే అనుకుంది.. కానీ రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా..
ప్రతీకాత్మక చిత్రం

చాలా ప్రేమ వ్యవహారాలు (love affairs) చివరకు విషాదాంతం అవుతుంటాయి. ప్రేమించిన వారిని అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ప్రేమికులు సంతోషంగా ఉన్నా.. కుటుంబ సభ్యుల మూలంగా సమస్యలు తలెత్తుతుంటాయి. కర్ణాటకలో తాజాగా విషాద ఘటన చోటు చేసుకుంది. ఇష్టం లేదని చెబితే అర్థం చేసుకుంటాడని ఆ యువతి అనుకుంది. కానీ, ఓ రోజు రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


కర్ణాటక (Karnataka) రాష్ట్రం హాసన్ జిల్లా సకలేష్‌పూర్‌కు చెందిన జీఆర్‌ భరత్ అనే యువకుడు కొన్ని నెలలుగా శరణ్య అనే యువతిని ఇష్టపడుతున్నాడు. ఓ రోజు తన మనసులోని ప్రేమను ఆమెకు తెలియజేశాడు. అయితే ఆమె.. నాకు ఇష్టం లేదంటూ తిరస్కరించింది. కానీ యువకుడు మాత్రం రోజూ ఆమెనే ఫాలో అవుతుండేవాడు. తనను ప్రేమించాలంటూ రోజూ వెంటబడేవాడు. అయినా యువతి మాత్రం అతన్ని పట్టించుకోలేదు. కొన్నాళ్లు పోతే అర్థం చేసుకుంటాడులే అని అనుకుంది. కానీ భరత్ మాత్రం.. పదే పదే ప్రేమించమంటూ ఆమెను విసిగించేవాడు. దీంతో ఇటీవల ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదంటూ.. కోపంగా బదులిచ్చింది.

పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..


దీంతో ఆమెపై అతను పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందించాలని కుట్ర పన్నాడు. పోలీసులకు దొరక్కుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ వేశాడు. మైసూరుకు వెళ్లి కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 3వ తేదీన రోడ్డుపై నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తున్న శరణ్యను వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 4వ తేదీన మృతి చెందింది. చివరకు భరత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రి 11గంటలకు బయటకు వెళ్లిన బాలిక.. ఉదయం 5గంటలకు ప్రత్యక్షం.. రాత్రంతా ఎక్కడికెళ్లావని ప్రశ్నించగా..



Updated Date - 2022-08-21T01:28:19+05:30 IST