వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పరిచయం.. మొదట ఫోన్‌లో మాత్రమే మాట్లాడే యువకుడు.. ఓరోజు ప్రియురాలు ఒంటరిగా ఉండగా ఇంట్లోకి వెళ్లి..

ABN , First Publish Date - 2022-06-15T21:46:31+05:30 IST

చాలా మంది యువతీయువకుల మధ్య ఏర్పడే పరిచయం.. చివరకు ప్రేమగా మారుతుంది. అనంతరం పెళ్లి వరకు వెళ్తుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా..

వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పరిచయం.. మొదట ఫోన్‌లో మాత్రమే మాట్లాడే యువకుడు.. ఓరోజు ప్రియురాలు ఒంటరిగా ఉండగా ఇంట్లోకి వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది యువతీయువకుల మధ్య ఏర్పడే పరిచయం.. చివరకు ప్రేమగా మారుతుంది. అనంతరం పెళ్లి వరకు వెళ్తుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. ప్రేమ పేరుతో దగ్గరయ్యే యువకులు.. పెళ్లి వరకు వచ్చేసరికి మాట తప్పుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు యువతులు.. చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. వారిద్దరికీ ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మొదట ఫోన్లలో మాత్రమే మాట్లాడుకునేవారు. అయితే ఓ రోజు యువతి ఒంటరిగా, యువకుడు ఇంట్లోకి వెళ్లి మాయమాటలు చెప్పి యువతిని నమ్మించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పరిధికి చెందిన 22 ఏళ్ల యువతి.. బీఎస్‌ఏసీ చివరి సంవత్సరం చదువుతోంది. ఇదిలావుండగా,  ఐదేళ్ల క్రితం ఆమెకు తమ సమీప ప్రాంతానికి చెందిన ఓంకేష్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. మొదట రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. తర్వాత కొన్నాళ్లకు అప్పుడప్పుడూ ప్రియురాలిని చూడటానికి వస్తుండేవాడు. ఓ రోజు యువతి ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకుని వెళ్లాడు. ముందుగా ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడంటే అప్పటికే ఇష్టం ఉండడంతో యువతి కూడా బాగా నమ్మింది. దీన్ని అవకాశంగా తీసుకున్న యువకుడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మొబైల్ షాపు నిర్వాహకుడితో వివాహితకు పరిచయం.. ఉపాధి నిమిత్తం భర్త దూరంగా ఉండడంతో... ఓ రోజు ఏకంగా ఇంటికే పిలిచి..


తర్వాత ఓ రోజు ప్రియురాలిని తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఇంట్లో రెండు రోజులు ఉంచుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇలా ఐదేళ్ల పాటు మాయమాటలు చెబుతూ ఆమెను నమ్మిస్తూ వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి బలవంతం చేస్తుండడంతో ఇటీవల ఆమెను దూరం పెట్టాడు. ఓ రోజు గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. అంతటితో ఆగకుండా ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న యువతి.. న్యాయం చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

లభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..

Updated Date - 2022-06-15T21:46:31+05:30 IST