Viral Video: జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి..
ABN , First Publish Date - 2022-05-19T15:16:48+05:30 IST
సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఇందులో కొందరు విజయవంతమవుతుంటే.. మరికొందరు..
సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఇందులో కొందరు విజయవంతమవుతుంటే.. మరికొందరు విఫలమవుతుంటారు. చివరకు అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూస్తాడు. అయితే చివరికి అతడి అంచనాలు తలకిందలవుతాయి..
ట్విటర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని సుసాంగ్ కౌంటీలోని జియుజింగ్‌గౌ ప్రాంతంలోని జలపాతం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జలపాతం వద్ద చాలా మంది సందర్శకులు సేదతీరుతూ ఉంటారు. అదే సమయంలో ఓ యువకుడు జలపాతం పైన విన్యాసం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా అదుపుతప్పి పైనుంచి నీటిలో వేగంగా కిందకు పడిపోతాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నీటితో పాటూ వేగంగా కిందకు జారుకుంటూ వచ్చిన యువకుడు.. ఓ నీటి గుంతలో పడిపోతాడు. తర్వాత అక్కడున్న వారు అతన్ని కాపాడి, బయటికి తీసుకొస్తారు. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడతాడు. గత వారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.