పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..

ABN , First Publish Date - 2022-08-20T02:40:15+05:30 IST

ఆ యువకుడు పెళ్లయిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. చివరకు ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆమె తన భర్తకు తెలీకుండా యువకుడితో కలుస్తూ ఉండేది. ఇటీవల ఏకంగా ఆమెను..

పెళ్లయిన మహిళతో ప్రేమ.. బైకులో ఎక్కించుకుని వెళ్తూ... స్నేహితుడికి ఫోన్ చేసిన తర్వాత వారు చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

ఆ యువకుడు పెళ్లయిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. చివరకు ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆమె తన భర్తకు తెలీకుండా యువకుడితో కలుస్తూ ఉండేది. ఇటీవల ఏకంగా ఆమెను బైకుపై ఎక్కించుకుని పరారయ్యాడు. ఊరు దాటిన కాసేపటికి స్నేహితుడికి ఫోన్ చేసి, విషయం తెలియజేశాడు. ఫోన్ పెట్టేసిన కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


కర్ణాటక (Karnataka) రాష్ట్రం బళ్లారి (Bellary) పరిధి దావణగెరె జిల్లా బెంకికెరె గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చరణ్ అనే వ్యక్తి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇతడికి సమీపంలో ఉంటున్న నాగరత్న అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాగరత్నకు భర్త, పిల్లలు ఉన్నారు. అయినా ఇంట్లో తెలీకుండా యువకుడితో కలుస్తూ ఉండేది. ఇటీవల వీరి వ్యవహారం మహిళ భర్తకు తెలిసింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. కొన్నాళ్లు దూరంగా ఉన్న ఇద్దరూ తర్వాత మళ్లీ కలుసుకోవడం ప్రారంభించారు.

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..


చివరకు, ఎలాగైనా కలిసి జీవించాలని లేదా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి ఆమెను తీసుకుని బైకులో దావణగెరె జిల్లాలోని బెంకికెరె గ్రామ సమీపంలోకి చేరుకున్నాడు. స్నేహితుడికి ఫోన్ చేసి, మేము చనిపోతున్నాం.. అని చెప్పి పెట్టేశాడు. కంగారపడ్డ అతను విషయాన్ని అందరికీ తెలియజేశాడు. అంతా అక్కడికి వెళ్లేసరికి.. ఇద్దరూ చెరువులో శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Wife Killed Husband: భర్తను చంపి బాత్రూంలోనే మృతదేహాన్ని రెండ్రోజుల పాటు దాచిన భార్య.. వాసన వస్తోందని ఆమె చేసిన పనితో..



Updated Date - 2022-08-20T02:40:15+05:30 IST